Movies

మంచు విష్ణు మోసగాళ్లు రివ్యూ – CHITRAMBHALARE.IN Mosagallu Movie Review Rating in Telugu


Mosagallu Movie Review Rating in Telugu

Mosagallu Movie Review Rating in Telugu
విడుదల తేదీ : మార్చి 19, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, రుహి సింగ్, నవీన్ చంద్ర
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్
నిర్మాత‌లు : విష్ణు మంచు
సంగీతం : సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ : షెల్డన్ చౌ

కాజల్ అగర్వాల్, మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో… జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మోసగాళ్లు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మాతగా ఈ సినిమా తెర‌కెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అక్కా త‌మ్ముళ్లుగా నటించిన ఈ సినిమా అతిపెద్ద ఐటీ స్కామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ :
అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవలలు. పేదరికం నుంచి వచ్చిన అర్జున్(మంచు విష్ణు) మరియు అను(కాజల్ అగర్వాల్) లు తమ జీవితాలపై పెద్ద కలలు కంటూ ఉంటారు. మరి అలా ఎదిగాక అర్జున్ ఒక పర్ఫెక్ట్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గానూ అలాగే అను అకౌంటెంట్ గా మారుతారు. మరి ఇక్కడ వీరికి అర్జున్ బాస్ సందీప్ రెడ్డి(నవదీప్) నుంచి ఒక భారీ స్కామ్ ప్లాన్ కోసం చర్చ వస్తుంది. అది కూడా అమెరికన్స్ మీదనే చెయ్యాలని గట్టి ప్లాన్ గీస్తారు. వీళ్ళని అడ్డుకునేది ఎవరు? అగ్ర రాజ్యం అమెరికా ఏం చేసింది? ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
ఇటీవల కాలంలో స్కామ్స్ పై ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది అది ఈ సినిమాకు మంచి ప్లస్ అని చెప్పొచ్చు. ఈ స్కామ్ కోసం తెలియని ఆడియెన్స్ కు అయితే ఈ చిత్రం మరింత థ్రిల్ ను ఇస్తుంది. ఇది కూడా నిజ జీవితంలో జరిగిన భారీ స్కామ్ కావడం దాని చుట్టూతా తిరిగే నరేషన్ ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగుతుంది. డైరెక్టర్ కూడా కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో ఫుల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

అక్కా తమ్ముల్లుగా చేసిన మంచు విష్ణు మరియు కాజల్ లు మంచి నటన కనబరిచారు. ఎవరూ తక్కువ కాకుండా తమ రోల్స్ లో సూపర్బ్ అండ్ సెటిల్డ్ నటనను వీరు కనబరిచారు. నవదీప్ తన ఇంటెన్స్ రోల్ తో షాక్ చేస్తాడు. ఇక మరో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర తన అగ్రెసివ్ రోల్ లో ఆకట్టుకుంటాడు..

మైనస్ పాయింట్స్ :
మెయిన్ లీడ్ లో కనిపించే విష్ణు మరియు కాజల్ లు చేసిన రోల్స్ ను చూపించే ప్రయత్నంలో అనేక లాజిక్స్ మిస్సవుతాయి..వీటితో పాటుగా క్లైమాక్స్ కూడా ఇంకా క్లారిటీగా ఇచ్చి ఉంటే బాగుండేది. సునీల్ శెట్టి లాంటి రోల్స్ ను ఇంకా స్ట్రాంగ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా అంత రియలిస్టిక్ గా అనిపించవు. మరో మాట సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ స్థాయి ఎమోషన్స్ కూడా అంతగా ఉండవు.

సాంకేతిక వర్గం :
నటన పరంగా మంచు విష్ణు, కాజల్,నవదీప్, సునీల్ శెట్టి అందరు అద్భుతంగా చేసారు. నిర్మాణ పరంగా మాత్రం వారు ఎక్కడా రాజీ పడినట్టు అనిపించదు మంచి రిచ్ గానే సినిమా అంతా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక దర్శకుడు జెఫ్రీ గీ చిన్ విషయానికి వస్తే ఇదొక ట్రూ స్టోరీ కాబట్టి ఆ స్కామ్ రిలేటెడ్ అంశాలను బాగా చూపించగలిగారు.. స్క్రీన్ ప్లే కూడా ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది.

తీర్పు :
టాక్స్ పేరుతో అమెరికా ప్రజలను బెదిరిస్తూ 300 మిలియన్ డాలర్స్ అంటే అక్షరాలా 26 వేల కోట్లు స్కామ్ చేస్తారు. ఇక వీరిని పట్టుకోడానికి ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. పై ఆఫీసర్ల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అర్జున్ మోసాన్ని బయటపెట్టి చివరకు అరెస్ట్ చేస్తాడు. మెయిన్ లీడ్ లలో కనిపించిన విష్ణు మరియు కాజల్ సహా నవదీప్ లు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు. సరైన నరేషన్ లేకపోవడం డీటెయిల్స్ సరైన ఎమోషన్స్ వంటివి మిస్సవ్వడం నిరాశ పరుస్తాయి. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణుకు మంచి హిట్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు.

 Source link