Movies

180CR ప్రొడ్యూసర్ భారాన్ని తీసుకున్న రాజమౌళి..!! –





SS Rajamouli guarantee signs for Rs 200 Crore Debts
SS Rajamouli guarantee signs for Rs 200 Crore Debts

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR మూవీ అన్నీ అనుకున్నట్టు జరిగినట్టు అయితే నిన్న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల అలాగే కోవిడ్ కేసులు పెరగటంతో అలాగే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు 50% పరిమితం చేయడంతో సినిమాని మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఆర్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

RRR మూవీ నీ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. కానీ మూవీ మేకర్స్ నుండి దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. RRR మూవీ ని సుమారు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో లో సుమారు 180 కోట్ల రూపాయల వరకు ఫైనాన్సు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కి సంబంధించిన డీల్స్ అన్ని పూర్తయిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలను చెల్లించి సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఇప్పుడు వాటికి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. మరోపక్క ఫైనాన్షియ‌ర్లు నిర్మాతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

RRR Director helping hands to Producer DVV danayya over 180 CR guarantee
RRR Director helping hands to Producer DVV danayya over 180 CR guarantee

ఇప్పుడు రాజమౌళి RRR ప్రొడ్యూసర్ కి అండగా నిలిచాడు. తను ఫైనాన్సు ఇవ్వాల్సిన 180 కోట్ల గానూ రాజమౌళి గ్యారంటీ సంతకం చేశారట. ఒక్కసారి సినిమా విడుదలైన వెంటనే ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. రాజమౌళి చేసే సినిమాల్లో తను కూడా ట్రాఫిక్ లో నుంచి డబ్బులు తీసుకుంటారు అందువల్లనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలకు దర్శకులు ఇలా అండగా నిలబడడం అభినందించాల్సిన విషయం.





Source link